ADB: ప్రమాదవశాత్తు చైనా మాంజా తగలడంతో ఓ యువకుడు గాయపడ్డాడు. పోలీసుల వివరాలు ప్రకారం.. బేలాకు చెందిన కార్పెంటర్ దేవాజీ పని నిమిత్తం ఆదిలాబాద్‌కు వచ్చాడు. ఈ క్రమంలో బైక్‌పై వెళ్తుండగా పట్టణంలోని శాంతినగర్ ఈవీఎం గోదాం సమీపంలోని చెట్టుపై వేలాడుతున్న చైనా మాంజా గొంతుకు తగలడంతో ఆయనకు గాయమైంది.