PDPL: గోదావరిఖని పట్టణ శివారులో ఉన్న గోదావరి నదిలో నీటి ప్రవాహం రోజురోజుకు తగ్గిపోతుంది. దీంతో గోదావరి ప్రాంతమంతా ఎడారిలా కనిపిస్తోంది. రానున్న నెల రోజుల్లో సమ్మక్క జాతర ఉన్నందున భక్తుల పుణ్య స్నానాలకు నీటి కరవు ఏర్పడే పరిస్థితి నెలకొంది. మొన్నటిదాకా గలగల పారే గోదావరి ఇప్పుడు పాయలు పాయలుగా విడిపోయింది