ASR: కొయ్యూరు సర్కిల్ కార్యాలయం, పోలీసు స్టేషన్, మంప పోలీస్ స్టేషన్లను చింతపల్లి ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా రికార్డులను పరిశీలించారు. పెండింగ్లో ఉన్న కేసులు గురించి ఆరా తీశారు. పెండింగ్లో ఉన్న కేసులు వెంటనే పరిష్కరించాలని సూచించారు. గంజాయి నిర్మూలనకు పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. సీఐ బీ.శ్రీనివాసరావు పాల్గొన్నారు.