VSP: వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం విశాఖ జిల్లాలో వైష్ణవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. అల్లిపురం, మెయిన్ రోడ్డు, పోర్టు ఏరియా, కంచర వీధి, పెదవాల్తేరు, బీచ్ రోడ్, పెందుర్తి, ఋషికొండ ప్రాంతాల్లోని వెంకటేశ్వర, జగన్నాథ, పాండురంగ, సత్యనారాయణ స్వామి ఆలయాల్లో రాత్రి నుంచే భక్తుల రద్దీ కనిపించింది.