SKLM: పాలన సౌలభ్యం కోసమే పునర్వ్యవస్థీకరణ చేపట్టడం జరిగిందని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఈ మేరకు కోటబొమ్మాళి మండలం నిమ్మాడ మంత్రి క్యాంప్ కార్యాలయం నుంచి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నందిగాం మండలాన్ని టెక్కలి రెవెన్యూ డివిజన్లో కలిపినట్లు ప్రభుత్వం జీవో విడుదల చేసిందన్నారు. YCP ప్రభుత్వ హయాంలో అనాలోచిత కారణాలవలన నిపుణుల సూచనలకు ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు.