MBNR: జిల్లా కేంద్రంలోని ఎంప్లాయ్మెంట్ కార్యాలయంలో మంగళవారం జాబ్ మేళా నిర్వహించామని జిల్లా ఉపాధి కల్పన అధికారిణి మైత్రిప్రియ తెలిపారు. 6 ప్రైవేట్ సంస్థలలో మొత్తం 260 ఉద్యోగ ఖాళీల కోసం వివిధ జిల్లాల నుంచి దాదాపుగా 120 మంది నిరుద్యోగులు హాజరయ్యారన్నారు. వారిలో షార్ట్ లిస్టు తీసి.. అర్హులైన విద్యార్థులకు ఆఫర్ లెటర్ అందించినట్లు పేర్కొన్నారు.