పల్నాడు జిల్లాలో నేరాలు 13% తగ్గాయని ఎస్పీ కృష్ణారావు ఇవాళ తెలిపారు. మహిళలు, ఎస్సీ, ఎస్టీలపై దాడులు తగ్గినప్పటికీ, రోడ్డు ప్రమాద మరణాలు 5% పెరగడంపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సైబర్ నేరాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని, లోక్ అదాలత్ ద్వారా ఈ ఏడాది 9,078 కేసులు పరిష్కరించామని ఆయన వెల్లడించారు.