SDPT: మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న కూలీ బురద నీటిలో పడి, ఊపిరాడక మృతిచెందిన ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్దగుండవెల్లిలో మంగళవారం చోటుచేసుకుంది. దుబ్బాక ఎస్సై కీర్తిరాజు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన జోగు ప్రభాకర్(45) గ్రామంలో కూలి పని చేస్తూ, భార్య,ఇద్దరు పిల్లలతో జీవనం కొనసాగిస్తున్నాడు. పొలంలో ఒడ్డు చెక్కేందుకు వెళ్లి పొలంలో పడి మృతి చెందాడు.