SDPT: కొమురవెల్లి మల్లికార్జున స్వామి హుండీ ఆదాయాన్ని ఆలయ అధికారులు మంగళవారం లెక్కించారు. స్వామివారికి 49 రోజులో రూ.1,15,42,056 ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి టి. వెంకటేశ్ తెలిపారు. 60 గ్రాముల మిశ్రమ బంగారం, 5 కిలోల 500 గ్రాముల మిశ్రమ వెండి, 50విదేశీ నోట్లు వచ్చాయన్నారు. ఈకార్యక్రమంలో ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.