ప్రకాశం: కంభం మండలంలోని దేవనగరం గ్రామంలో బెల్ట్ షాపులపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో గంట రత్నం అనే వ్యక్తిని అదుపులో తీసుకుని అతని వద్ద నుంచి 16 క్వార్టర్ బాటిళ్లు, 9 బీర్లు స్వాధీనం చేసుకున్నట్లు కంభం ఎస్సై శివ కృష్ణ రెడ్డి తెలిపారు. ఎస్సై మాట్లాడుతూ… మండలంలో ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.