TPT: శ్రీకాళహస్తీశ్వర దేవస్థానానికి దేవదాయ ధర్మదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ కుటుంబ సమేతంగా విచ్చేశారు. వీరికి ఆలయ ఈవో బాపిరెడ్డి దర్శనం ఏర్పాట్లు కల్పించి, స్వామి అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయంలోని నూతన క్యూలైన్లను పరిశీలించి తగిన సూచనలు ఇచ్చారు. 300 పూల కుండీలు ఏర్పాటు చేయాలని, మనమిత్ర వాట్సాప్ సేవలను విస్తృత ప్రచారం చేయాలని ఆదేశించారు.