NRPT: మాదకద్రవ్యాల అనర్థాలపై యువతకు, విద్యార్థులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ శ్రీను అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన మాదకద్రవ్యాల నిషేధ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో గంజాయి సాగుపై నిఘా ఉంచాలని, కళాశాలల్లో తప్పనిసరిగా యాంటీ డ్రగ్ కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు.