VSP: నూతన సంవత్సర వేడుకలకు తప్పనిసరిగా అనుమతులు ఉండాలని పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి మంగళవారం తెలిపారు. నూతన సంవత్సరానికి గాను అనుమతులు లేకుండా ఈవెంట్లు ఏర్పాటు చేస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముందస్తుగా అనుమతులు తీసుకోవాలన్నారు. మద్యం తాగి హల్చల్ చేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అన్నారు.