KMR: నగరంలో తాగునీటి సమస్య పరిష్కారానికి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పేర్కొన్నారు. ఈ మేరకు నగరంలో రూ.6.50 కోట్ల వ్యయంతో ఆధునిక నీటి ట్యాంక్‌ల నిర్మాణ పనులను మంగళవారం ప్రారంభించారు. తాగునీటి ట్యాంక్‌ల నిర్మాణ పనుల ప్రారంభోత్సవం అనంతరం స్థానిక కేకే ఫంక్షన్ హాల్లో సమావేశం నిర్వహించారు.