NZB: మూడు రోజుల పాటు జరిగే బడా పహాడ్ ఉర్సు ఏర్పాట్లను మంగళవారం బోధన్ ఏసీపీ శ్రీనివాస్ పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు. అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుని ఉర్సును శాంతియుత వాతావరణంలో నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రుద్రూర్ సీఐ కృష్ణ, వర్ని ఎస్సై వంశీకృష్ణ పాల్గొన్నారు.