తమిళనాడుకు వలస వచ్చిన ఒడిశా కార్మికుడిపై నలుగురు మైనర్లు కత్తితో దాడి చేసిన ఘటనపై సీపీఐ ప్రధాన కార్యదర్శి రాజా తీవ్రంగా స్పందించారు. ఈ హత్యకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. తమిళనాడులో ఇలాంటి దాడులు ఎప్పుడూ జరగలేదని.. అక్కడ దశాబ్దాలుగా వలస కార్మికులు ఎంతో ప్రశాంతంగా జీవిస్తున్నారని గుర్తు చేశారు. తాజా ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు.