TG: సంక్రాంతికి టోల్ భారం భరించాలనే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై SMలో పలువురు నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. తెలంగాణలో అత్యధిక మంది జరుపుకునే దసరా పండగకు లేని మినహాయింపు.. ఏపీలో ఎక్కువగా జరుపుకునే సంక్రాంతికి ఎందుకు? అని ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ టోల్ మినహాయింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుందో చూడాలి.