KNR: దివ్యాంగులను సకలాంగులు వివాహం చేసుకుంటే ఇచ్చే రూ.లక్ష ప్రోత్సాహకాన్ని ఇకపై ఇద్దరు దివ్యాంగులు వివాహం చేసుకున్నా అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మే 19, 2025 తర్వాత పెళ్లి చేసుకున్నవారు www.epass.telangana.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం దరఖాస్తులను స్థానిక ఐసీడీఎస్(ICDS) కార్యా లయంలో సమర్పించాలని జిల్లా సంక్షేమ అధికారి పేర్కొన్నారు.