MHBD: తొర్రూరు మండలంలోని అమ్మాపురం గ్రామంలో శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ఇవాళ ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు అమ్మాపురం నూతన సర్పంచ్ ముద్దం సునీత వీరారెడ్డి పాల్గొని ఆలయ ఉత్తర ద్వారం గుండా స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శేషాచార్యులు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు.