ATP: మహిళా ప్రజా ప్రతినిధులను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన సింగనమల మండలం కల్లుమడి గ్రామానికి చెందిన నాగేంద్రను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. కదిరి బస్టాండ్ వద్ద అతన్ని అదుపులోకి తీసుకున్నారు. మహిళల గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తిస్తే రౌడీ షీట్ నుంచి పీడీ యాక్ట్ వరకు కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.