VZM: డిసెంబర్ 31 నుంచి జనవరి 4 వరకు విశాఖపట్నంలో సీఐటీయూ జాతీయ మహాసభలు జయప్రదం చేయాలని కోరుతూ ఇవాళ బైక్ ర్యాలీ నిర్వహించారు. గరివిడి సీఐటీయూ మండల కమిటీ ఆధ్వర్యంలో గరివిడి గేటు సెంటర్ నుంచి చీపురుపల్లి ఆర్డీవో ఆఫీస్ వరకు బైక్ ర్యాలీ కొనసాగింది. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి టీవీ రమణ, గరివిడి మండల శాఖ ప్రధాన కార్యదర్శి ఏ గౌరి నాయుడు పాల్గొన్నారు.