CTR: పెద్దపంజాణి మండలంలోని రాయలపేట-చౌడేపల్లి రోడ్డులోని కెళవాతి బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయానికి వంట పాత్రలు విరాళంగా అందించారు. చౌడేపల్లి మండలం మేకల చిన్నేపల్లి జెడ్పీ హైస్కూల్లో 2007లో చదివిన పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి రూ.35 వేల విలువైన వంట పాత్రలు ఆలయానికి అందించారు. వారిని ఆలయ నిర్వాహకులు అభినందించారు.