ASR: నూతన సంవత్సర వేడుకలకు డిశంబరు 31న లంబసింగి వచ్చే పర్యాటకులకు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక రుచులు అందించనున్నట్లు పర్యాటక శాఖ మేనేజర్ అప్పలనాయుడు మంగళవారం తెలిపారు. రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఆ శాఖ డీఎం జగదీశ్ నేతృత్వంలో హరిత రిసార్ట్స్‌కు వచ్చే పర్యాటకులకు కోడి కూర, రాగి సంకటి, కుండ బిర్యాని తదితర వంటకాలు అందిస్తామన్నారు.