GNTR: ప్రత్తిపాడులో నూతనంగా ఏర్పాటు చేయనున్న మండల విద్యా వనరుల కార్యాలయం మంగళవారం శంకుస్థాపన జరిగింది. రూ.53 లక్షలతో నిర్మించిన ఈ MRC భవనానికి ఎంపీడీఓ శివపార్వతి, MEOలు రమాదేవి, లీలారాణిలతో పాటు టీడీపీ మండల కన్వీనర్ శివరాంప్రసాద్, కూటమి నాయకులు కలిసి ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.