MNCL: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో డిసెంబర్ 31, నూతన సంవత్సర వేడుకలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని సీపీ అంబర్ కిషోర్ ఝా అన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలిగేలా బహిరంగ ప్రదేశాల్లో వేడుకలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 31న రాత్రి 10 గంటల నుండి నిర్వహించే స్పెషల్ డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.