పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ మూవీ రాబోతుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఈ న్యూఇయర్ నైట్‌కి ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఫస్ట్ లుక్కు సంబంధించిన షూట్ పూర్తయినట్లు సమాచారం. ఇది ప్రేక్షకుల్లో భారీ ఇంపాక్ట్ సృష్టిస్తుందని మేకర్స్ భావిస్తున్నారట.