NZB: చిన్నారులతో బలవంతంగా భిక్షాటన, వెట్టి చాకిరీ చేయిస్తున్న వాళ్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అదనపు డీసీపీ బస్వారెడ్డి అన్నారు. సోమవారం సీపీ సాయిచైతన్య సూచనల మేరకు ‘ఆపరేషన్ స్మైల్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆర్మూర్, బోధన్,NZB డివిజన్ల పరిధిలో 18 ఏళ్ల లోపు తప్పిపోయిన బాలురు, బాలికలు ఉన్నట్లయితే అలాంటి వారి సమాచారం సేకరించాలన్నారు.