SRPT: పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులతో మర్యాదగా ప్రవర్తించి, సమస్యలను త్వరగా పరిష్కరించాలని సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్ ఆదేశించారు. ఇవాళ మద్దిరాల పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన ఆయన.. రికార్డులను పరిశీలించి మొక్కలు నాటారు. పెండింగ్ కేసులు లేకుండా చూడాలని, పెట్రోలింగ్ ముమ్మరం చేసి నేరాల నియంత్రణకు నిరంతరం నిఘా ఉంచాలని సిబ్బందికి సూచించారు.