NLG: రైతులకు యూరియా పంపిణీ ప్రక్రియలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా కఠిన నిఘా పెట్టాలని కలెక్టర్ ఇలా త్రిపాఠీ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. సాగు పనుల సమయంలో ఎరువుల పంపిణీ వద్ద వివాదాలు జరగకుండా మండల ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలన్నారు. ప్రభుత్వ యూరియా యాప్లో వచ్చే సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు.