BHPL: టేకుమట్ల మండల కేంద్రంలోని MRO కార్యాలయంలో సీపీఐ(ఎం)ఎల్ రాష్ట్ర కమిటీ సభ్యుడు మారపల్లి మల్లేశ్, VCK పార్టీ రాష్ట్ర యూత్ అధ్యక్షుడు అనిల్ కుమార్తో కలిసి ఎంఆర్వోకు వినతిపత్రం అందజేశారు. కలికోట ఓడేడు అంతర్ జిల్లా వంతెన నిర్మాణంలో పాలకులు విఫలమయ్యారని మల్లేశ్ ఆరోపించారు. వెంటనే అధికారులు స్పందించి నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.