TG: మహిళ హత్య కేసులో మేడ్చల్ జిల్లా మూడో అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు నిందితుడికి మరణశిక్ష విధించింది. కర్ణాటకకు చెందిన కరణ్ సింగ్(35) అనే వ్యక్తి సనత్‌నగర్ PS పరిధిలో 2011 జూలై 18న ఓ మహిళను దారుణంగా హత్య చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు నిందితుడిని అరెస్టు చేశారు. అనంతరం ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. విచారణ అనంతరం కోర్టు మరణశిక్షతో పాటు రూ.10వేల జరిమానా విధించింది.