BPT: ఏపీ మంత్రివర్గ సమావేశంలో అద్దంకికి సంబంధించి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. అద్దంకిని నూతన రెవెన్యూ డివిజన్‌గా మారుస్తూనే, తిరిగి ప్రకాశం జిల్లాలో విలీనం చేసేందుకు సోమవారం కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నెల 31న గెజిట్ విడుదల కానుండగా, 2026 జనవరి 1వ తేదీ నుంచి ఈ మార్పులు అధికారికంగా అమలులోకి రానున్నాయి.