MBNR: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై గత బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాన్ని రాష్ట్ర నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. డీపీఆర్ ఆమోదం లేకుండా రూ.20,000 కోట్లు పైగా ఖర్చు చేసి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు అన్యాయం జరిగిందని తెలిపారు. అదనంగా బీఆర్ఎస్ ప్రభుత్వం 90 శాతం పనులు పూర్తయినట్లు చేసిన ప్రచారం అసత్యమని ఆయన స్పష్టం చేశారు.