TG: జనవరి 28 నుంచి నాలుగు రోజుల పాటు జరిగే మేడారం జాతరకు భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో మేడారం పరిసర ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ముఖ్యంగా సమ్మక్క, సారలమ్మలను తీసుకొచ్చే ఘట్టం ప్రధానమైనది. ఇందుకోసం గద్దెలను అభివృద్ధి చేసి.. మేడారానికి కొత్త రూపు తీసుకొచ్చింది.