కేంద్ర రవాణాశాఖ వాహన యజమానులు, లైసెన్స్ హోల్డర్లు తమ మొబైల్ నంబర్‌ను వెంటనే అప్డేట్ చేసుకోవాలని సూచించింది. పాత నంబర్లు వల్ల చలాన్లు, ఇన్సూరెన్స్, ఫిట్నెస్ వంటి కీలక సమాచారం అందకపోవడం సమస్యగా మారిందని పేర్కొంది. వినియోగదారులు ‘వాహన్’, ‘సారథి’ పోర్టల్స్ ద్వారా RC, ఛాసిస్, ఇంజిన్ నంబర్ల వివరాలను నమోదు చేసి, సులభంగా తమ మొబైల్ నంబర్‌ను అప్డేట్ చేసుకోవచ్చు.