ELR: జిల్లా వ్యాప్తంగా పోలీసు పీజీఆర్ఎస్కు 45 ఫిర్యాదులు అందాయని ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ తెలిపారు. సోమవారం జిల్లా ఎస్పీ ఆఫీసులో జిల్లా ఎస్పీ పీజీఆర్ఎస్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ ఫిర్యాదులపై వెంటనే చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఫోన్లో ఆదేశాలు జారీ చేశారు.