VZM: ఎరువుల విక్రయంలో నిబంధనలు ఉల్లంఘించినా, కృత్రిమ కొరత సృష్టించినా, ఎరువులు మళ్లింపుచేసినా డీలర్లపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి హెచ్చరించారు. సోమవారం వ్యవసాయ అధికారులతో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్లో కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం, రాబోయే పంటలకు అవసరమైన ఎరువులు గ్రామ, మండలాల వారీగా అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.