అనంతపురం కేఎస్ఎన్ మహిళా డిగ్రీ కళాశాల పీడీ శ్రీనివాస్ ప్రసాద్‌ను విధుల నుంచి తొలగించి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించాయి. మహిళా విద్యార్థుల పట్ల అసభ్య ప్రవర్తన, గేమ్స్ ఎంపికల్లో అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. అనంతరం కలెక్టర్ ఆనంద్ కుమార్‌కు వినతి పత్రం అందజేశారు.