కృష్ణా: వంట గ్యాస్ సిలిండర్లను కాటా పెట్టి ఇవ్వాలని మచిలీపట్నంలోని కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ డీ.కే బాలాజీకి జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శేకుబోయిన సుబ్రహ్మణ్యం సోమవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. గతంలో వంట గ్యాస్ సిలిండర్ను ఇంటి వద్ద డెలివరీ ఇచ్చే సమయంలో కాటా పెట్టి ఇచ్చేవారని తెలిపారు.