E.G: అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సోమవారం కీలక కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో పాటు నిడదవోలు ఎమ్మెల్యే, పర్యాటక, సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఇతర సహచర మంత్రులతో కలిసి పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, పలు కీలక పథకాల అమలుపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు.