సత్యసాయి: జిల్లాలో భూ వివాదాల శాశ్వత పరిష్కారానికి కలెక్టర్ శ్యాంప్రసాద్ సోమవారం ‘రెవెన్యూ క్లినిక్స్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి 4వ సోమవారం కలెక్టరేట్లో, మిగిలిన వారాల్లో డివిజన్ స్థాయిలో ఈ సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. మ్యుటేషన్లు, పట్టాదార్ పాస్ పుస్తకాలు, భూముల ఆక్రమణలపై వచ్చే ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.