NLG: హాలియా ఎక్సెజ్ కార్యాలయం ముందు మద్యం వ్యాపారి విద్యాసాగర్ రెడ్డి పురుగుల మందు డబ్బాతో ఇవాళ నిరసన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే.. పెద్దవూర మండల కేంద్రంలో విద్యాసాగర్ రెడ్డి దగ్గరి బంధువుల పేరిట మద్యం షాపు వచ్చింది. కానీ ఆ షాపును ఏర్పాటు చేసుకునేందుకు ఎక్సైజ్ అధికారులు అనుమతి ఇవ్వడం లేదని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే మందే డబ్బాతో నిరసన తెలిపారు.