WNP: పట్టణంలోని రాయిగడ్డ కాలనీలో ఏర్పాటుచేస్తున్న సెల్ టవర్ నిర్మాణాన్ని నిలిపివేయాలని ప్రజావాణిలో కాలనీవాసులు కలెక్టర్ ఆదర్శ్ సురభికి వినతి పత్రంఇచ్చారు. నివాసగృహాల మధ్య టవర్ ఏర్పాటు చేయడంతో అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదంఉందని పేర్కొన్నారు. టవర్ ఏర్పాటును నిలిపివేయాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. మండ్ల దేవన్ననాయుడు, చుక్కరాజు, సంతోష్ యాదవ్ పాల్గొన్నారు.