NLG: జిల్లాలో చైనీస్ మాంజా వినియోగం, నిల్వ, విక్రయాలపై పూర్తిస్థాయి నిషేధం అమలులో ఉందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ఈ సందర్భంగా నిషేధాన్ని ఉల్లంఘించే వ్యాపారులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రమాదకర మాంజా వల్ల ప్రజలు, పక్షులు, ప్రజా ఆస్తులకు నష్టం జరుగుతున్నందున ప్రత్యేక తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు.