AP: ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదంపై సీఎం చంద్రబాబు స్పందించారు. రైలు కోచ్లలో మంటలు చెలరేగిన సమయంలో 150 మందికి పైగా ప్రయాణికులను సురక్షితంగా బయటకు తరలించిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బందిని ఆయన అభినందించారు. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోవడం అత్యంత బాధాకరమన్నారు. మృతుని కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.