ప్రెసిడెంట్స్ కప్ డిపార్ట్మెంటల్ టోర్నీలో సూయి నార్తర్న్ గ్యాస్ జట్టు తరపున ఆడిన షాన్ మసూద్ రికార్డు క్రియేట్ చేశాడు. పాకిస్తానీ ఫస్ట్ క్లాస్ క్రిెకెట్లో శరవేగంగా డబుల్ సెంచరీ చేసిన పాక్ క్రికెటర్గా ఘనత సాధించాడు. 177 బంతుల్లోనే అతను డబుల్ సెంచరీ చేశాడు. గతంలో ఇంజమాబుల్ హక్(188 బంతుల్లో) రికార్డును మసూద్ బ్రేక్ చేశాడు.