W.G: తాడేపల్లిగూడెం (M) ఎల్.అగ్రహారం రాల్ల సాహెబ్ల కాలనీలో నిర్మాణంలో ఉన్న ఇంటిలో ఈగల గణేశ్ (20) అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తాపీ పనులు చేసే గణేశ్ ఆదివారం రాత్రి ఇంటికి రాకపోవడంతో గాలింపు చేపట్టగా ఘటన వెలుగులోకి వచ్చింది. మృతికి కారణాలు తెలియాల్సి ఉండగా, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.