MDK: కౌడిపల్లి మండల కేంద్రంలో ఆశా వర్కర్లను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ‘ఛలో అసెంబ్లీ’ ముట్టడి కార్యక్రమానికి వెళ్తున్న ఆశ వర్కర్లను అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. కనీస వేతనం అమలు చేయాలని ఆశ వర్కర్లు డిమాండ్ చేశారు.