NDL: నంద్యాల పట్టణంలో ఇవాళ ఎంపీ బైరెడ్డి శబరి పర్యటించారు. పట్టణంలోని శాంతినికేతన్ స్కూల్లో వందేమాతరం గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో ఎంపీ బైరెడ్డి శబరి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులు ఎంపీ బైరెడ్డి శబరిని ఘనంగా సన్మానించారు.