AKP: ఖేలో ఇండియా బాక్సింగ్ కోచ్‌గా ఎంపికైన నేషనల్ బాక్సర్ కే. కృష్ణవేణి సోమవారం స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడును మర్యాదపూర్వకంగా కలిశారు. నర్సీపట్నం ప్రభుత్వ బాలికల విద్యాసంస్థల్లో విద్యాభ్యాసం చేసిన ఆమె అక్కడే బాక్సింగ్‌లో తొలి అడుగులు వేసి రాష్ట్ర, జాతీయ పోటీల్లో పతకాలు సాధించారు. స్పీకర్ ఆమెను అభినందిస్తూ, కోచ్‌గా మంచి విజయం సాధించాలన్నారు.